జైలంటే భయం లేదు.. అనర్హతను లెక్కచేయబోనన్న లేదన్న రాహుల్
నా నోరు మూగబోదు.. ప్రశ్నిస్తూనే ఉంటుంది
మోడీకి భయపడేదే లేదన్న రాహుల్ గాంధీ
అదానీ కోసం దేశంలో రూల్స్ మారిపోతున్నాయని వివరించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ వేదికగా మంత్రులు అబద్ధాలు చెబుతున్నారన్నారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. పార్లమెంట్‌లో అదానీ అంశం గురించి మాట్లాడేందుకు అనుమతించలేదన్నారు. అదానీ అంశం నుంచి దేశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఇండియా విషయంలో ఎన్నటికీ విదేశీ జోక్యం తాను కోరలేదన్నారు రాహుల్. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. అదానీ కోసం రూల్స్ రాత్రికి రాత్రే మారిపోయాయన్నారు. నేను ఎప్పటికీ సైలంట్ గా ఉండబోను. మాట్లాడుతూనే ఉంటానన్నారు.