Home Page SliderNational

“లాయర్లు జీన్స్ ధరిస్తే కోర్టుకు నో ఎంట్రీ”: సుప్రీం

సుప్రీం కోర్టు లాయర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇకపై ప్రతి లాయర్ రూల్స్ ప్రకారం నిర్ధిష్ట దుస్తుల్లోనే కోర్టుకు రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా ఓ లాయర్ ఇటీవల జీన్స్ ధరించి గౌహతి హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గౌహతి హైకోర్టు ఆ లాయర్‌ను కోర్టు నుంచి వెళ్లిపోవాలని కోరలేదంట. కాగా ఆ లాయర్‌‌ను కోర్టు నుంచి బయటికి పంపించాలని గౌహతి హైకోర్టు పోలీస్ సిబ్బందిని ఆదేశించడంపై ఆ లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆ లాయర్ తనను డీకోర్ట్ చేసే అధికారం హైకోర్టుకు లేదని వాదించారు. ఇది విన్న సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి లాయర్‌ను వెళ్లిపోవాలని కోరకుండా పోలీసులను ఆదేశించడం సరికాదని పేర్కొంది.