ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అవిశ్వాస తీర్మానం- అమిత్ షా
మణిపూర్ హింసాకాండకు కారణమైన పరిణామాల గురించి లోక్ సభలో హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదల కోసం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తే, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కరోనా మహమ్మారి ముట్టడి వేళ, కోవిడ్, డ్రగ్స్ మహమ్మారిపై పోరాటం పరంగా పోరాడామన్నారు. ఈశాన్య రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశామంటూ వస్తున్న ఆరోపణలపై ఆనయ మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం “రాజకీయ ప్రేరేపితమైనది” కాబట్టి ప్రభుత్వ “విజయాల”పై దృష్టి పెట్టాలని షా అన్నారు. ‘ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే’ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారని అమిత్ షా ఆరోపించారు. ‘30 ఏళ్లుగా దేశం వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి, కులతత్వంతో బాధపడుతోందని, వీటన్నింటిని పూర్తి చేసి ప్రధాని మోదీ దేశానికి పనితీరును అందించారని అన్నారు. ” “స్వాతంత్య్రానంతరం, భారతదేశం పూర్తిగా విశ్వసించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రధాని మోడీ మాత్రమే. ఈ అవిశ్వాస తీర్మానం ప్రజల ఎంపికను ప్రతిబింబించదు, అది అంతరాయం కలిగించడానికి మాత్రమే తీసుకురాబడింది” అన్నారు.
కాంగ్రెస్ లాగా బీజేపీ గెలుపు కోసం ముడుపుల జోలికి వెళ్లదని అన్నారు. పీవీ నర్సింహారావు అధికారంలో ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాలని భావించి ఆ తీర్మానాన్ని నెగ్గించుకున్నారు. జేఎంఎం, పలువురు నేతలకు లంచాలు ఇచ్చారు. ఎందరో నేతలు జైలు పాలయ్యారు. మాజీ ప్రధాని నర్సింహారావుకి కూడా జైలు శిక్ష కూడా పడింది” అని షా అన్నారు. “1999లో, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో, మేము కూడా నేతలకు లంచం ఇవ్వడం చేయగలిగితే, అవిశ్వాస తీర్మానాన్ని రక్షించగలిగేవారమన్నారు. కానీ అలా చేయలేదన్నారు. కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాం” అని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ప్రతిపక్షం, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఖ్యాబలం గురించి తెలుసు. ఐనా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయాలని కుట్రలు చేశారన్నారు.

