Andhra PradeshHome Page SliderNews AlertPolitics

‘లోకేష్‌పై చర్యలు లేవా?’… బొత్స

టెన్త్ క్లాస్ వాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఆరోపణలు చేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ.  పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం విద్యామంత్రి లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఏకంగా 1650 మంది రీవ్యాల్యుయేషన్‌ చేయించుకున్నారని, గత ప్రభుత్వ కాలంలో  500మంది కంటే ఎక్కువ విద్యార్థులు రీవాల్యుయేషన్ చేయించుకోలేదని పేర్కొన్నారు. పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను ఒత్తిడి చేసి, రికార్డు సమయంలో వేల్యుయేషన్ చేయించారని మండిపడ్డారు. నిబంధనలు పక్కన పెట్టి ఒక్కొక్కరికి ఎక్కువ పేపర్లు ఇచ్చారని, ప్రభుత్వం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని మండిపడ్డారు.  మూడు రోజులు కడపలో టీడీపీ మహానాడు పేరుతో డ్రామాలాడారని, గత ఏడాదిలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. విద్యార్థులకిచ్చే తల్లికి వందనం కూడా రద్దు చేశారని,  పెన్షన్‌ పెంపు తప్ప ఏ ఇతర హామీలు  అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.