Home Page SliderNationalNewsPolitics

బీజేపీకి నీతీశ్ కుమార్ షాక్

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో ఉన్న నీతీశ్ కుమార్ మణిపూర్‌ రాష్ట్రంలోని బీజేపీ సర్కారుకు మాత్రం మద్దతు ఉపసంహరించుకున్నారు. మణిపూర్‌లోని జేడీయూ పార్టీ అధ్యక్షుడు క్షేత్రమయం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అక్కడ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు తమ మద్దతు కొనసాగదని, తమ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని పేర్కొన్నారు. 2022లో జరిగిన మణిపూర్ ఎన్నికలలో జేడీయూకి 6 స్థానాలు వచ్చినా, కొద్ది నెలలోనే ఐదుగురు బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం బీజేపీకి 37 మంది సభ్యులున్నారు. జేడీయూకి ఒకే ఎమ్మెల్యే ఉండడం వల్ల ప్రస్తుతానికి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు. ఇటీవల జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు, మహిళలపై అఘాయిత్యాలు, విపరీత రీతిలో హత్యలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఈ ఘటనపై భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.