సరికొత్త ఆల్బమ్‌తోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నితిన్
టాలీవుడ్ యువ హీరో నితిన్ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌తో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్న ఈ యువ హీరో స్ట్రాంగ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్‌రాజు నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు. సిస్టర్ ఎమోషన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ “తమ్ముడు”. టైటిల్‌తోనే మేకర్స్ మార్కెట్‌లో మంచి బజ్ క్రియేట్ చేశారు.
ఈ చిత్రంలో ఒకప్పటి హీరోయిన్ లయ రీఎంట్రీ ఇస్తున్నారు. లయ పాత్ర మూవీలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఆమె నితిన్ అక్క పాత్రలో కనిపించబోతోంది. “తమ్ముడు” సినిమా 2024 ఆరంభంలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ లీక్ అయ్యింది అంటూ ఇటీవల కొన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పూర్తిస్థాయిలో సరికొత్త ఆల్బమ్‌తోనే మేకర్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇక నితిన్ తదుపరి సినిమాల లైనప్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో “రాబిన్‌హుడ్” కూడా చేస్తున్నాడు. ఈ చిత్రం వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది, డిసెంబర్ 20న “రాబిన్‌హుడ్” సినిమాను రిలీజ్ చేయనున్నారు. నితిన్, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలలో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ, ఆయా సాంగ్స్‌లో పవన్ కళ్యాణ్ వేసిన కాస్ట్యూమ్స్ కూడా ఉపయోగించాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో మాత్రం అలాంటివి పెద్దగా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఇక నితిన్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు అడుగులు వేస్తున్నాడు.

