నిర్మలమ్మ నోట గురజాడ మాట…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆమె ప్రసంగాన్ని మొదలుపెడుతూ తేట తెలుగులో గురజాడ అప్పారావు రాసిన పద్యంలోని ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ తన బడ్జెట్ స్పీచ్ మొదలు పెట్టారు. దీనితో సాధారణ భారత ప్రజలకే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ‘ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పీపుల్’ అంటూ మధ్యతరగతి, పేద ప్రజలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకెళుతున్నామని ఆమె పేర్కొన్నారు. పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక సిద్ధం చేస్తున్నటు తెలిపారు. ప్రయోగాత్మకంగా 100 జిల్లాలలో ప్రధానమంత్రి ధన్‌ధాన్య యోజన అమలు చేస్తామన్నారు.