Telangana

TSPSC కేసులో కొత్త ట్విస్ట్

TSPSC కేసులో తవ్వేకొద్ది  కొత్త ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. ఈ కేసులో సిట్ అధికారులచే పెద్దపెట్టున అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వందకు పైగా అరెస్టులు జరిగాయి. తాజాగా ఓ ఎంపీటీసీ కుమార్తె కూడా ఇందులో భాగమయ్యింది. ఈ ఘటనలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న డీఈ రమేష్ చేతి వాటం ప్రదర్సించాడు. పేపరును ఈమెకు అప్పగించి, హైటెక్ కాపీయింగ్ కు పాల్పడుతున్నాడు. తన వద్ద ఈ పేపర్ లేకపోయినా పరీక్ష ప్రారంభమయ్యాక అలెర్టుగా ఉండి, టెక్నికల్ డివైజ్‌లతో కాపీయింగ్‌కు హెల్ప్ చేస్తున్నాడు. ఈ కేసులో ఇంకెంతమంది ప్రమేయం ఉందో తెలియాల్సి ఉంది.