వీరి కోసం రూ.14,235 కోట్లతో కొత్త పథకాలు
దేశంలో రైతుల బాగు కోసం, వారి ఆదాయాలను మెరుగు పరచడానికి ఏడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది కేంద్రం. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.14,235 కోట్లను ఈ పథకాలకు కేటాయించారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ఆమోదించారు. రైతుల జీవితాలు, జీవనోపాధిలో సమూల మార్పులు తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు సహాయపడతాయని ప్రకటించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ పథకాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. వీటివల్ల రైతులకు పంట సాగు, మార్కెటింగ్‌కు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని అందించగలమని పేర్కొన్నారు.