Andhra PradeshBreaking NewsNews AlertTrending Today

ఇంటర్మీడియట్ విద్యలో కొత్త షెడ్యూల్, ఏప్రిల్ నుంచి అమలు…!

2025-26 విద్యా సంవత్సరంలో, ఇంటర్మీడియట్ బోర్డు కీలక సంస్కరణలు చేపట్టేందుకు మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. వీటిలో విద్యా విధానంలో పెద్ద స్థాయి మార్పులు ఉన్నాయి, వాటి ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యా ప్రమాణాలు పెంచడం మరియు ప్రైవేట్ కళాశాలలకు సమానమైన విద్యార్థులను తయారుచేయడం లక్ష్యంగా తీసుకోబడింది.

ముఖ్యమైన మార్పులు:

ప్రస్తుతంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి ప్రారంభం అవుతుంటే, 2025-26 విద్యా సంవత్సరంలో ఈ తేదీని ఏప్రిల్ 1కి మార్చడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్లుఏప్రిల్ 7 నుంచి ప్రారంభం అవుతాయి. దీని ద్వారా విద్యార్థులు సమయానికి ప్రవేశం పొందగలుగుతారు మరియు విద్యాసంవత్సరం సమర్ధవంతంగా సాగుతుంది.

సాధారణంగా వార్షిక పరీక్షలుమార్చి లేదా ఏప్రిల్ నెలలో జరగేవి. కానీ 2025-26 విద్యా సంవత్సరం నుండి, పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించటానికి నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా, విద్యార్థులు సమయం పట్ల బాధ్యతగా, చాలా ముందుగా తమ పరీక్షా ప్రిపరేషన్ ప్రారంభించగలుగుతారు..

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం ఎలక్టివ్ సబ్జెక్టులు 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 24 సబ్జెక్టుల ఆప్షన్స్ నుండి ఒకటి ఎంపిక చేసుకుని, 2వ సబ్జెక్టుగా విద్యార్థి ఇష్టాన్ని పరిగణించవచ్చు. లాంగ్వేజెస్, సైన్స్, హ్యూమానిటీస్ విభాగాలలో ఈ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఎంబైపీసీ కోర్సుకు సంబంధించి 6 సబ్జెక్టులతో కొత్త పాఠ్యపధతిని అమలు చేయాలని నిర్ణయించారు. మ్యాథ్స్ మరియు బయాలజీ సబ్జెక్టులు ఇందులో భాగంగా ఉండేలా ఎంబైపీసీ కోర్సు రూపకల్పన చేయబడింది.

14 సబ్జెక్టులకుసవరించిన సిలబస్ తో కొత్త పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టబడతాయి. వీటిలో సైన్స్, హ్యూమానిటీస్, లాంగ్వేజెస్ విభాగాలు ఉన్నాయి. మ్యాథ్స్ A, మ్యాథ్స్ B రెండు సబ్జెక్టుల్ని ఒకే సబ్జెక్టుగా విలీనం చేయడం జరిగింది. బైపీసీ విద్యార్థుల కోసం బోటనీ మరియు జూవాలజీ సబ్జెక్టులను ఒకే సబ్జెక్టుగా విలీనం చేయడం జరిగింద.

ఈఏపీసెట్, జేఈఈ, నీట్ వంటి ప్రముఖ పోటీ పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి కోచింగ్ మెటీరియల్ అందించబడుతుంది. ఈ మెటీరియల్ ఉచితంగాఇంటర్మీడియట్ బోర్డు పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా తయారుచేసిన మెటీరియల్‌ను ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో 10% ప్రశ్నలుబహుళ ఎంపిక ప్రశ్నలు (MCQs) రూపంలో ఉండాలని నిర్ణయించారు. బహుళ ఎంపిక ప్రశ్నలు మరియు ఒక మార్కు ప్రశ్నలు ద్వారా క్వాలిటీ పరీక్షలను రూపొందించేందుకు ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.