ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త రూల్..పాటించకపోతే జరిమానా
బీహర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. ఈ రూల్ ప్రకారం బీహర్‌లో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్,టీషర్ట్ వేసుకొని ఆఫీసుకు రాకూడదు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే ఈ రూల్‌ను పాటించాలని బీహర్ సరన్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలిచ్చింది. అయితే ఉద్యోగులందరూ కూడా ఫార్మల్ డ్రెస్‌లోనే ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆఫీసులో ఉన్నంతసేపు ID కార్డు ధరించాలని సూచించింది. బీహర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆదేశాలను ఉద్యోగులంతా పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేపడతామంది. రూల్స్ పాటించని ఉద్యోగులకు జరిమానా విధిస్తామని మేజిస్ట్రేట్ హెచ్చరించింది.