తెలంగాణ విద్యామండలి కొత్త నిర్ణయం..ఎవరికి లాభమంటే
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇంజనీరింగ్ విద్య విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. లోకల్, నాన్ లోకల్ విద్యార్థుల విషయంలో కొత్త ప్రామాణికతను తెరమీదకి తెచ్చింది. దీనివల్ల నాన్ లోకల్‌గా భావింపబడే కొందరు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు లాభం కలుగనుంది. ఇప్పటి వరకూ 6 నుండి 12 వ తరగతి వరకూ ఏడేళ్లకాలానికి వర్తించే లోకల్ కోటాను ఇకపై నాలుగేళ్లకు కుదించారు. నాలుగేళ్ల పాటు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తే అక్కడ స్థానికతను పరిగణిస్తామని తెలిపారు. నాన్ లోకల్ కోటా కింద 15శాతం సీట్లను ఇంజనీరింగులో కేటాయిస్తున్నారు. ఏపీ విద్యార్థులకు ఈ సంవత్సరం వరకూ లోకల్ కోటా కిందనే సీట్లు కేటాయించారు. ఏపీ, తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న 10 ఏళ్ల కాలం పూర్తి కావడంతో వచ్చే ఏడాది నుండి ఏపీ విద్యార్థులు తెలంగాణలో నాన్ లోకల్ కానున్నారు.

