ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సుల హవా
తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. సాధారణ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, భీమా కోర్సులను కూడా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశపెట్టడానికి ఉన్నతవిద్యాశాఖ నిర్ణయించింది. ఈ రంగాలలో ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. బీటెక్ కాలేజీలలో దీనిని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టనున్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులు ఇంటర్యూల ద్వారా కొందరు విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. విద్యార్థులు తమ బ్రాంచ్‌తో పాటే ఈ శిక్షణ కూడా పొందవచ్చు. తెలంగాణలో ఈ సంవత్సరం నుండి దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారని సమాచారం.

