Home Page SliderNational

దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కాగా దేశంలో ఇవాళ ఒక్కరోజే  7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 కి చేరింది. అయితే తాజాగా కరోనా నుంచి 4,692 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా దేశంలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 3.65% నికి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని ప్రతి ఒక్కరు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.