తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులు..కేంద్రమంత్రితో సీఎం భేటీ
తెలంగాణలోని రామగుండం, వరంగల్‌లో కొత్త ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు రామ్మోహన్ నాయుడు. వరంగల్ మామనూర్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అంగీకారం కుదిరింది. రామగుండం, కొత్తగూడెం ఎయిర్ పోర్టులను కొత్తగా నెలకొల్పడానికి శాయశక్తులా కృషి చేస్తామని విమానయాన శాఖ మంత్రి తెలిపారు. భూసేకరణ పూర్తి కాగానే వరంగల్ మామనూర్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామని తెలిపారు.