Home Page SliderNational

ఎన్నడు చూడని కారు ప్రమాదం.. తెగిపడిన విద్యార్థుల తలలు..

జార్ఖండ్ లోని డెహ్రడూన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్ లోనే ఆరుగురు స్టూడెంట్స్ మృతి చెందారు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. స్టూడెంట్స్ తలలు తెగిపడ్డాయి. చనిపోయిన మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. యాక్సిడెంట్ కు ముందు కాలేజీ స్టూడెంట్స్ పార్టీ చేసుకుంటూ మద్యం మత్తులో ట్రక్కును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మితి మీరిన వేగం లో కారు నడిపినట్లు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిందని పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తులో స్టూడెంట్స్ డ్రైవ్ చేస్తూ.. బీఎండబ్ల్యూ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ట్రక్కును కారు వెనకనుంచి హైస్పీడ్ లో బలంగా ఢీకొట్టింది. కారు తుక్కుతుక్కయింది. ఆరుగురు విద్యార్థులు స్పాట్ లోని చనిపోయారు.