నీరజ్ చోప్రా జావెలిన్‌కు వేలంలో అదిరిపోయే ధర
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గత ఏడాది స్వర్ణం సాధించి దేశం పేరు నిలబెట్టిన సంగతి మనకు తెలిసిందే. దీనిని ఒలింపిక్స్ అనంతరం ప్రధాని మోదీకి సమర్పించాడు నీరజ్ చోప్రా. అయితే మోదీ తన వద్ద ఉన్న వివిధ వస్తువులను ఇ- వేలం ప్రక్రియలో ఉంచారు. ఈ వేలానికి తాజాగా బిడ్లు తెరిచారు. ఈవేలాన్ని గత సంవత్సరం అక్టోబర్‌లో నిర్వహించారు. ఈ వేలంలో ప్రధానికి లభించిన 1,348 జ్ఞాపికలను విక్రయానికి ఉంచగా, మొత్తం 8,600 బిడ్లు దాఖలు అయినట్లు సమాచారం.
ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీదేవి ఖడ్గం 1.25 కోట్లు ధర పలుకగా, పారా ఒలింపిక్ ఛాంపియన్ సుమీత్ అంటిల్‌కు చెందిన జావెలిన్‌కు కోటి రూపాయలు ధర పలికింది. మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్కు చెందిన గ్లోవ్స్‌కు 91 లక్షల రూపాయలు లభించాయి. అయితే అన్నింటికన్నా అత్యధికంగా టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఉపయోగించిన జావెలిన్‌ను 1.5 కోట్ల రూపాయలు ధరకు బీసీసీఐ ( BCCI) సొంతం చేసుకుంది.