పంజాబ్ నుండి ఏపీకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
పంజాబ్‌లోని లూథియానా నుండి ఏపీకి భారీ సహాయం చేయడానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ముందుకొచ్చాయి. ఏపీలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు ఈ బృందాలు చేరుకున్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం సైన్యానికి చెందిన రెండు హెలికాఫ్టర్లు కూడా సిద్దమయ్యాయి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ చొరవతో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కేంద్రప్రభుత్వం సహకారంతో ఈ సహాయక చర్యలు ముమ్మురం కానున్నాయి. విజయవాడ ప్రాంతంలో చిక్కుకుపోయిన కాలనీలలో ప్రజలను కాపాడేందుకు ఈ హెలికాఫ్టర్లు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో కరెంటు పూర్తిగా బంద్ చేయడం వల్ల సెల్‌ఫోన్లు నిలిచిపోయాయి. సెల్ సిగ్నల్స్ పంపే సెల్ టవర్లు కూడా నీటమునగడంతో వాటికి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో నేడు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి సెల్ సిగ్నల్స్ పనిచేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. వారి సంబందీకులు, కుటుంబాలు నీటిలో ముంపునకు గురయ్యారని ఆందోళనలు చెందుతున్నారు.