రికార్డ్ సాధించిన ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా
జమ్మూకాశ్మీర్ ఎన్నికలలో ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా రికార్డు సాధించనున్నారు. పోటీ చేసిన రెండుచోట్లా ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బుద్గాం, గందర్ బల్ రెండు నియోజక వర్గాలలోనూ ఆయన పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఈ లీడింగ్‌పై ఆయన ఇప్పుడే ఏం వ్యాఖ్యానించబోనని, పూర్తి ఫలితాలు వెల్లడయ్యాకే ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ 90 స్థానాలలో లెక్కింపు కొనసాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ 56కు 39, కాంగ్రెస్ 39కి 9 స్థానాలలోనూ ఆధిక్యతలో ఉంది. బీజేపీ 62 చోట్ల పోటీ చేయగా 29 స్థానాలలో ముందంజలో ఉంది.


 
							 
							