అభిమానులను ఆశ్చర్యపరిచిన నయనతార
స్టార్ హీరోయిన్‌గా, లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది అందాల తార నయనతార. తాజాగా తన కొత్త సినిమా ప్రారంభోత్సవంలో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె కొత్త చిత్రం ‘ముక్తి అమ్మన్ 2’ కోసం చెన్నైలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో పూజా కార్యక్రమం జరిగింది. అయితే సాధారణంగా సినిమా కార్యక్రమాలకు హాజరుకాని నయనతార ఈ కార్యక్రమానికి హాజరు కావడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. దర్శకుడు సుందర్.సి తో పాటు నయనతార, మీనా, ఖుష్భూ, రెజీనా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. గతంలో నయనతార నటించిన ‘ముక్తి అమ్మన్’ చిత్రం విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఖుష్భూ భర్త, దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె నెల రోజులుగా ఉపవాసం చేస్తూ, కష్టపడి పనిచేస్తున్నారని దీనిని పాన్ ఇండియా చిత్రంగా, రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నామని మూవీ టీం తెలియజేసింది.

