నయనతార,విఘ్నేశ్‌లకు జంటఫలం
పెళ్లయి 4 నెలలు కూడా గడవకముందే నయనతార, విఘ్నేశ్‌లు తల్లిదండ్రులయ్యి, అభిమానులకు షాకిచ్చారు. ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలో వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన డాక్యుమెంటరీ త్వరలోనే రాబోతోంది. ‘నయనతార: beyond the fairytale’ పేరుతో ఇది నెట్ ఫ్లిక్స్‌లో రానుంది. ఇంతలో తమకు ట్విన్స్ పుట్టారంటూ పిల్లల పాదాల ఫొటోలను షేర్ చేశారు ఈ దంపతులు. తమకు కవలపిల్లలు (అబ్బాయిలు) జన్మించారని, వారిని ఆశీర్వదించాలని కోరారు. పలువురు సినీప్రముఖులు,అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులైనట్లు మీడియాలలో కథనాలు వస్తున్నాయి.


 
							 
							