InternationalNationalTrending Today

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దుమ్మురేపుతున్న నాటు నాటు పాట…

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీ జరుగుతున్న తరుణంలో విజేత ఎవరన్నదానిపై ఉత్కంఠ ఎక్కువవుతోంది. రెండోసారి అధ్యక్ష రేసులో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గెలుపు తనదేనన్న దీమాతో ఉంటే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విజయం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. స్వతహాగా బలంగా ఉండే డెమొక్రట్లు ఈసారి అమెరికన్ ఆసియన్ కమలాహ్యారిస్ ట్యాగ్ లైన్ ను సైతం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే కమలా హ్యారిస్ భర్త ఇజ్రాయెల్ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయ్. అయితే అమెరికాలో కీలకంగా ఉన్న సౌత్ ఏసియన్స్ ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్ కు ఓటేయాలంటూ అక్కడ ఇండియన్లతోపాటుగా, సౌత్ ఏసియన్స్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీలో దుమ్మురేపిన నాచు నాచు సాంగ్ అదేనంటే తెలుగులో నాటు నాటు పాటతో ఇప్పుడు అమెరికా అంతటా ప్రచారం చేస్తున్నారు. భారతీయులతోపాటు, ఆసియన్ సంతతి ప్రజల్లో ఈ పాట ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

ప్రముఖ భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ భూటోరియా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కోసం “నాచో నాచో” అనే హిందీ ప్రచార పాటను విడుదల చేశారు. “RRR” చిత్రం నుండి ఆస్కార్-విజేత ట్రాక్ “నాటు నాటు” నుండి ప్రేరణ పొందిన ఈ పాటను బాలీవుడ్ గాయకుడు షిబానీ కశ్యప్ పాడారు. నవంబర్ 5 ఎన్నికలలో భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ కోసం దక్షిణాసియా ఓటర్లను సమీకరించడం లక్ష్యంగా ఈ పాటను ప్రచారం చేస్తున్నారు. “‘నాచో నాచో’ కేవలం ఒక పాట కాదు, ఇది ఒక ఉద్యమం. ఈ ప్రచారం బ్యాటిల్ ఫీల్డ్ స్టేట్స్ మరియు కీలక జిల్లాల్లోని విభిన్న దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీతో కనెక్ట్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. 4.4 మిలియన్లకు పైగా భారతీయ అమెరికన్లతోపాటుగా 6 మిలియన్ల దక్షిణాసియా ప్రజలు ఓటు వేయడానికి అర్హులు. 2024లో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను విజయపథంలో నడిపించడం మా లక్ష్యం” అని భూటోరియా చెప్పారు. కమలా హారిస్ తన నామినేషన్‌ను ఆమోదిస్తూ చూపించే వీడియోకు మ్యూజిక్ జతచేశామన్నారు. ఇది హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, గుజరాతీ, బెంగాలీ తదితర భాషల్లో ఓటర్లలో చైతన్యం తీసుకొస్తుందని ఆయన అన్నారు.

“2020లో, దక్షిణాసియా, ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన మొదటి మహిళను వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాం. ఇప్పుడు, 2024 లో కమలా హ్యారిస్‌ను అధ్యక్షురాలిగా చేయాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆయన అన్నారు. ఆమె గెలిస్తే 59 ఏళ్ల కమలా హారిస్ 248 ఏళ్ల అమెరికా చరిత్రలో ఆ దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డులకెక్కనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వయస్సుపై పెరుగుతున్న ఆందోళనల మధ్య అధ్యక్ష రేసు నుండి వైదొలిగిన తరువాత, ముఖ్యంగా జూన్‌లో రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ముఖాముఖీ తర్వాత డెమొక్రాట్ నామినీగాగా కమలా హ్యారిస్ నామినేట్ చేయబడ్డారు.

కమలా హారిస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ పై పోల్స్ ఏం చెబుతున్నాయి
ఆదివారం విడుదల చేసిన పోల్‌ అంచనాల ప్రకారం, కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ తమ మొదటి టెలివిజన్ చర్చను నిర్వహించడానికి రెండు రోజుల ముందు, US అధ్యక్ష ఎన్నికల పోటీ హోరాహోరీగా ఉంది. 78 ఏళ్ల ట్రంప్ జాతీయ స్థాయిలో హారిస్‌పై 48 నుంచి 47 శాతం ఆధిక్యంలో ఉన్నారని న్యూయార్క్ టైమ్స్/సియానా పోల్ వెల్లడించింది. పోల్ విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియాలో హారిస్ ముందంజలో ఉనారని, నాలుగు ఇతర స్వింగ్ స్టేట్స్, నెవాడా, జార్జియా, నార్త్ కరోలినా,
అరిజోనాలో… ఇద్దరి మధ్య టైగా ఉన్నట్లు తెలుస్తోంది. CBS న్యూస్/యూగోవ్ పోల్ ప్రకారం కమలా హ్యారిస్‌… మిచిగాన్, విస్కాన్సిన్‌లలో ఒక శాతం పాయింట్‌తో ముందుంది. పెన్సిల్వేనియాలో టైగా ఉన్నట్టు పేర్కొంది.