వనస్థలిపురం నారాయణ స్కూల్లో దారుణం
హైదరాబాద్ వనస్థలిపురంలోని నారాయణ స్కూల్లో దారుణం జరిగింది. శ్రీకాంత్ అనే విద్యార్థిని తోటి విద్యార్థులు బాత్రుంలో బంధించారు. అనంతరం శ్రీకాంత్ దాదాపు 10 మంది విద్యార్థులు కలిసి చితకబాదారు. ఎందుకంటే తనను బూతులు తిడుతున్నారని శ్రీకాంత్ వారిపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీకాంత్‌పై కక్ష పంచుకున్న తోటి విద్యార్థులు ఇలా చేసినట్లు సమాచారం. అయితే ఇంత చిన్న వయస్సులోనే పిల్లలు ఇలాంటి దారుణానికి పాల్పడడం బాధకరమైన విషయమే. ఈ ఘటన స్కూల్ సిబ్బందిని..తల్లిదండ్రులని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది.
