వైసీపి యూత్ వింగ్ రేస్‌లో నారాయణ రెడ్డి
యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్ష రేసులో వైవీ నారాయణ రెడ్డి నిలిచారు. ఈ మేరకు నారాయణ రెడ్డి తన అనుచరులుతో ఆదివారం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ని ఆయన నివాసంలో కలిశారు. పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించడంతో పాటు కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేకు వారంతా వివరించారు.నారాయణ రెడ్డి పెద్దారవీడు మండల పార్టీలో గత కొంత కాలం నుంచి క్రియాశీలకంగా కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేసే సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేయడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. నారాయణ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని పెద్దారవీడు జడ్పీటీసీ యేర్వ చలమారెడ్డి తదితరులు బలపరిచి మద్దతిచ్చారు.

