మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ
AP: అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో AI, IT, నైపుణ్యాభివృద్ధికి ఆయన మద్దతు ఇవ్వాలని కోరినట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో డిజిటల్ పరివర్తనకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో పర్యటించాలని సత్య నాదెళ్లను మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ టైములో సత్య నాదెళ్లతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.

