సూర్యను బీట్ చేసిన నాని..
ఇటీవల కాలంలో టాలీవుడ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్నాయి. హిందీ చిత్రాలకు కూడా మించిన కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట కురిపిస్తున్నాయి. మే 1న నాని చిత్రం హిట్ 3, హీరో సూర్య నటించిన రెట్రో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో హిట్3 హిట్ కొట్టింది. సూర్య రెట్రో చిత్రాన్ని బీట్ చేసి మొదటి రోజే రూ.43 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది. మరోవైపు రెట్రో చిత్రానికి ఆశించినంత వసూళ్లు రాలేదు. తమిళనాడులోనే కేవలం రూ. 17.75 కోట్లు వసూలు చేయగా, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుండి రూ.15 కోట్లు కూడా రాలేదు. మొత్తంగా ఈ చిత్ర కలెక్షన్స్ రూ.30 కోట్లతో నడుస్తున్నాయి.