నంద్యాలలో కిరాతకం..బాలికపై పెట్రోల్ దాడి
నంద్యాల జిల్లా నంది కొట్కూరులో ఒక యువకుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదని బాలికపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. అతనికి కూడా మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. కలుగొట్ల అనే గ్రామానికి చెందిన రాఘవేంద్ర (21) అనే యువకుడు బాలికను ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. దీనితో ఆమెను నందికొట్కూరులో అమ్మమ్మ ఇంటికి పంపారు. ఆదివారం అర్థరాత్రి బాలిక గదిలో ప్రవేశించి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు పెట్టడంతో అతడు గడియ తీసి పారిపోతుండగా కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. అతనికి గాయాలవడంతో అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.