Home Page SliderTelangana

  “IIHTకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు”..రేవంత్ రెడ్డి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి (IIHT) కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని  నిర్ణయించాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగం అని కొనియాడారు. హైదరాబాద్  లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ IIHT విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సహకాన్ని ప్రకటించారు. గతంలో తెలంగాణ విద్యార్థులు IIHTలో చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి. తెలంగాణలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు పదేళ్లుగా చర్యలు తీసుకోలేదు. ఈ అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే  ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసాం. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం.  తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ విద్యార్థులు IIHTలో చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసాం. వచ్చే ఏడాది నుంచి స్కిల్స్ యూనివర్సిటీలో IIHT భవనం ఉండేలా చర్యలు తీసుకుంటాం.  రైతన్న ఎంత ముఖ్యమో మాకు నేతన్న కూడా అంతే ముఖ్యం. మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా మీకు అండగా ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసే వారిది త్యాగం కాదు. అప్పటి వారిదే నిజమైన త్యాగం అంటూ వ్యాఖ్యానించారు