Home Page SliderTelangana

ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా నామా, కవిత ఖరారు

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరికి కేసీఆర్ తిరిగి అవకాశమిచ్చారు. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీగా మాలోతు కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత .. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే పార్టీ వారితో మాట్లాడిన తర్వాత మాత్రమే అభ్యర్థుల్ని ఖరారు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ 9 మంది అభ్యర్థులు జాబితాను విడుదల చేసింది. అయితే ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించలేదు.