నిండుకుండలా కళకళలాడుతున్న నాగార్జునసాగర్
నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. జలకళతో కళకళలాడుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం క్రస్ట్ గేట్లను కూడా తాకింది. శ్రీశైలం ప్రాజెక్టులో 10 గేట్లను ఎత్తి, భారీగా నీరు సాగర్‌కు విడుదల చేయడంతో పూర్తి నిల్వను సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీశైలం నుండి 3.36 లక్షల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్‌కు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 546 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 198 టీఎంసీల నీరు ఉంది. దీనితో పర్యాటకులు నాగార్జునసాగర్‌ను సందర్శించేందుకు పోటెత్తారు.