ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాగార్జున దంపతుల ఆహ్వానం
ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున, అమలల కుమారుడు అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్సయ్యింది. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో గతేడాది నవంబర్‌లో అఖిల్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం జూన్ 6న జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున, అమల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అఖిల్ హీరోగా ఐదు తెలుగు సినిమాలలో చేశారు.

