నాగ చైతన్య రికార్డ్ బ్రేక్..
హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం పైరసీ భూతాన్ని ఎదుర్కొంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. అంతేకాదు, ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లోని అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు సాధించి, బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లో కూడా తండేల్ అదరగొడుతోంది. ఇప్పటికే అక్కడ కూడా మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నిర్మాత బన్ని వాసు సంతోషంతో మేము వాగ్దానం చేసి, నిలబెట్టుకున్నాం అంటూ ట్వీట్ చేశారు. నాగచైతన్య, సాయిపల్లవిల కెమిస్ట్రీ, సాయిపల్లవి నటన, దర్శకుడు చందూ మొండేటి టేకింగ్, మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.