భద్రకాళి అమ్మవారికి నడ్డా పూజలు
హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. నడ్డాకు శాస్త్రోక్తంగా స్వాగతం పలికిన పండితులు ఆయనను ఆశీర్వదించారు. అమ్మవారి పూజల్లో నడ్డాతో పాటు తరుణ్‌చుగ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ధ్వజ స్థంభం వద్ద నడ్డా దీపం వెలిగించారు. అక్కడి గో శాలను సందర్శించారు. అక్కడి నుంచి పాలసముద్రంలో ఉన్న ఉద్యమకారుడు ప్రొఫెసర్ వెంకట నారాయణరెడ్డి ఇంటికి వెళ్లి తేనేటి విందు స్వీకరించారు. తర్వాత వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బండి సంజయ్ మహా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు.