Andhra PradeshHome Page SliderNews AlertSpiritual

శ్రీవారికి మైసూర్ రాజాస్థానం భారీ విరాళం..

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి మైసూరు రాజకుటుంబం నుండి భారీ విరాళం అందింది. మైసూరు రాజమాత ప్రమోదాదేవి రెండు నిలువెత్తు భారీ వెండి అఖండ దీపాలను అందజేశారు. వీటి బరువు ఒక్కోటి 50 కిలోలు ఉంటుంది. వీటిని తిరుమల రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ అధికారుల సమక్షంలో పండితులకు అందజేశారు.  గర్భగుడిలో నిరంతరంగా వెలిగించే సంప్రదాయ దీపాలను అఖండదీపాలంటారు. గతంలో 300 సంవత్సరాల క్రితం కూడా అప్పటి మైసూరు మహారాజా ఇలాంటి దీపాలను శ్రీవారికి అందించిట్లు తిరుమల చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ అలాంటి వాటినే రాజమాత అందజేశారు.