Home Page SliderInternational

మయన్మార్‌ సైనికులు భారత భూ భాగంలోకి చొరబాటు..

మయన్మార్‌ (బర్మా)కు చెందిన 151 మంది సైనికులు సరిహద్దు దాటి భారత భూ భాగంలోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి శుక్రవారం మయన్మార్‌ సైనికులు వచ్చినట్లు అస్సాం రైఫిల్స్‌ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్‌ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్‌ను ధ్వంసం చేసింది. దీంతో సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి ప్రాణాలను కాపాడుకోవడానికి భారత్‌లోకి ప్రవేశించారు.