మయన్మార్ భూకంపం..భారత్‌పై కూడా ప్రభావం..
మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ప్రభావం భారత్‌పై కూడా పడింది. భారత్‌లోని కోల్‌కతా, మేఘాలయా, ఇంఫాల్‌లలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. మేఘాలయలోని ఈస్ట్‌గారో హిల్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రత నమోదయ్యింది. ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. అలాగే మయన్మార్‌కు పొరుగునున్న బంగ్లాదేశ్‌లో కూడా 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు సమాచారం. ఈ భూకంపంపై భారత ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో ప్రజలు సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆ దేశాలకు తగిన సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

