NationalNews

నా ఇంటిపేరు గాంధీ -భయపడేదే లేదు

భయపడడానికి తాను సావర్కార్ కాదని, గాంధీనని మీడియా మీటింగ్‌లో గట్టిగా చెప్పారు రాహుల్ గాంధీ. అదానీకి, మోదీకి ఉండే సంబంధం ఏంటని ప్రశ్నించారు. అనర్హతను తాను శిక్షగా తాను భావించడం లేదని, దీనిని ఒక అవకాశంగా మార్చుకుని, ప్రజల్లోకి వెళతానని పేర్కొన్నారు. ప్రజలకు నిజాలు చెపుతానని, తాను క్షమాపణలు చెప్పబోనని,తనను పార్లమెంటులో మాట్లాడనీయటం లేదని మండిపడ్డారు. తనను జైలులో పెట్టినా-శాశ్వతంగా అనర్హుడ్ని చేసినా భయపడేది లేదన్నారు.