నా రాజకీయ గురువు చంద్రబాబు: ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలంగాణలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. స్వామి దర్శనం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నా. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. నా రాజకీయ గురువు ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి చంద్రబాబు నిత్యం పరితపిస్తారు అని ప్రకాష్‌గౌడ్ అన్నారు.

