‘వారికి నా హ్యాట్సాఫ్’..జగన్
స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. విలువలకు, విశ్వసనీయతకు మారుపేరుగా ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టారని వారికి నా హ్యాట్సాప్ అని మెచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో కూటమి పార్టీ నేతలు వారికి బలం లేకపోయినా అధికార అహంకారాన్ని చూపి పోలీస్ ద్వారా భయపెట్టి, కేసులు పెట్టి బెదిరించినా ధైర్యంగా నిలబడి మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారని, వారిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

