News AlertPoliticsTelangana

‘నా తండ్రి తెలంగాణ హీరో’..కేటీఆర్ ఎమోషనల్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఈ సందర్భంగా ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. కేసీఆర్ తన తండ్రి కావడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతీ తండ్రి తమ పిల్లల కలల హీరో అని, అలాగే తన తండ్రి తనకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రపంచానికే హీరో అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ అనే కల కోసం నిరంతరం పరితపించారని, సాధించారని పేర్కొన్నారు. మీ వారసత్వానికి అర్హులుగా నిరూపించుకోవడానికి ప్రతీ క్షణం కృషి చేస్తానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.  కేసీఆర్‌కు 71 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా  కేటీఆర్ 71 కేజీల కేక్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు.