మా నాన్న నాకే కాదు…ఈ రాష్ట్రానికే హీరో
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు వేడుకలను బీ.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు.ముందుగా తెలంగాణ భవన్ ఈ మేరకు భారీ కేక్ ను ఏర్పాటు చేశారు.ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మాజీ మంత్రులు కేటిఆర్, హరీష్‌రావు లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శ్రేణులనుద్దేశించి వారు మాట్లాడారు.కేటిఆర్ మాట్లాడుతూ తాను కేసిఆర్ కొడుకుగా పుట్టడం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అన్నారు.తనకే కాదని ఈ తెలంగాణకు కూడా కేసిఆర్ హీరో అని కొనియాడారు.హరీష్‌రావు మాట్లాడుతూ….తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్‌ని చూసినప్పుడు తనకు ఏడుపొచ్చేదని గుర్తు చేసుకున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమే అని వారు దీమా వ్యక్తం చేశారు.