ముస్లిం న్యూస్ పేజీ బ్లాక్ చేసిన మెటా
ఇన్ స్టాగ్రామ్ లో ముస్లిం వార్తల పేజీకి యాక్సెన్ ను ఇండియాలో మెటా బ్లాక్ చేసింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నడుమ మెటా సెన్సార్ విధించిందని ఖాతాదారుడు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో 6.7మిలియన్ల ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. ‘ఇండియాలో అకౌంట్ అందుబాటులో లేదు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మెటా తెలిపింది.