మస్క్ రాజీనామా చేస్తారు…ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక వర్గంలోని డోజ్‌లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ త్వరలోనే రాజీనామా చేయబోతున్నారంటూ ట్రంప్ సన్నిహిత వర్గాలతో వెల్లడించారు. మే చివరి వారంలో గానీ జూన్ మొదటివారంలో గానీ, ఈ బాధ్యతల నుండి బయటకు వచ్చే ఆవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ( డోజ్) విభాగానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మస్క్. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పు, శాఖలలో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే అనేక శాఖలలో వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. దీనితో ట్రంప్‌ను మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో ఆయనకు నిర్ణయాధికారాలు లేవంటూ వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మస్క్ రాజీనామా వార్తలతో రూమర్స్‌కు తెరపడవచ్చు.

