ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం..కోర్టు తీర్పు ఇదే..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషికి జీవిత ఖైదీగా కారాగార శిక్ష విధిస్తూ సిల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. దోషిగా నిర్థారించిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదుతో పాటు, రూ.50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే గత కొన్ని రోజులుగా అతనికి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ వస్తోంది. అతని తల్లి, సోదరి కూడా ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లబోమని, అతనిని దోషిగా నిర్థారిస్తే ఉరిశిక్ష వేయాలని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ ఛార్జిషీటులో సంజయ్ రాయ్ పేరును మాత్రమే చేర్చారు. అయితే ఈ రోజు న్యాయమూర్తి సంజయ్ రాయ్‌కి తన వాదన వినిపించే అవకాశం ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై ఈ నేరారోపణ చేశారని అతడు వాదన వినిపించాడు. అయితే సాక్ష్యాధారాలను బట్టి అతడే నేరం చేసినట్లు రుజువయ్యిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

