NewsTelangana

మునుగోడు నోటిఫికేషన్ వచ్చేసింది.. నవంబర్ 3న ఎన్నిక

దేశ వ్యాప్తంగా ఉన్న ఆరు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మునుగోడు ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 7న వెలువడనుంది. నామిషనేలకు చివరి తేదీ అక్టోబర్ 14. నామిషేన్లను ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 15న స్క్రిటినీ చేస్తారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోడానికి చివరి రోజు అక్టోబర్ 17. ఎన్నికలు నవంబర్ 3న జరుగుతాయ్. కౌంటింగ్ నవంబర్ 6న జరగుతుంది. ఎన్నికల ప్రక్రియ నవంబర్ 8న పూర్తవుతుంది.