Andhra PradeshBreaking NewsHome Page SliderNationalSpiritual

ర‌థ‌స‌ప్త‌మికి తిరుమ‌ల‌లో ముమ్మ‌ర ఏర్పాట్లు

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలెర్ట్ అయ్యింది. రథ సప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టిసారించారు. రథసప్తమి ఏర్పాట్లను సమీక్షించేందుకు టీటీడీ బోర్డు ఈ నెల 31న అత్యవసరంగా సమావేశంకానుంది. తిరుమలలో భక్తులకు కల్పించే సౌకర్యాలు, మరీ ముఖ్యంగా ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే.శ్యామలరావు అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు.సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 4న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి వేడుకను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి తిరువాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేయ‌నున్నారు.ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డీ) టోకన్ల జారీని రద్దు చేయ‌నున్న‌ట్లు టిటిడి తెలిపింది.