కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఎంపీ చామల హర్షం
దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ స్పందించారు. ఆ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారని తెలిపారు.