కేటీఆర్‌కు ఎంపీ అనిల్ కుమార్ కౌంటర్
పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. పవర్‌లో ఉన్నప్పుడు యువరాజులా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు తికమక అవుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసిందే బీఆర్‌ఎస్. ఇప్పుడు ఢిల్లీలో వారి పరిస్థితి చూస్తే బాధేస్తోంది అని అన్నారు.