మణిరత్నం , రజనీ కాంబినేషన్‌లో మూవీ
సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్.. గతంలో సంచలనాలకు చిరునామాగా నిలిచిన హిట్ కాంబినేషన్ మరోసారి సెట్స్ పైకి రాబోతోంది. రజనీకాంత్, మణిరత్నం ఇద్దరి కాంబినేషన్ అంటూనే ఊహించడానికి కష్టంగా ఉంటుంది. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆ ఇద్దరూ కలిసి సినిమా రూపొందిస్తున్నారంటూ కోలీవుడ్‌లో వార్తల గుప్పుమంటున్నాయ్. ఒక్క తమిళనాడులోనే కాకుండా… దేశ వ్యాప్తంగా రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన మూవీ వస్తుందంటేనే అభిమానులు వేయి కళ్లతో ఎదురుచుస్తారు. అంట్లాటిది రజనీ , మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా అంటే అభిమానులకు పండగనే చెప్పాలి. ఇంతకముందు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన దళపతి అప్పట్లో భారీ విజయం అందుకుంది. కాగా ప్రస్తుతం రజనీతో లైకా ప్రొడక్షన్స్ రెండు మూవీలు నిర్మించబోతోందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకటి శిబి చక్రవర్తి దర్శకుడు కాగా , రెండో చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.