NationalNewsNews Alert

కవలలకు జన్మనిచ్చిన సినీ హీరోయిన్

కొద్ది కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న సినీ నటి నమిత పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. చెన్నై సమీపంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చినట్టు , వారంతా ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించారు. తాను ప్రసవించిన ఆసుపత్రి యాజమాన్యంకి , వైద్యపరమైన సలహాలు , సూచనలు , జాగ్రత్తలు తెలిపిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. .ఇప్పటి వరకు కొనసాగించిన అభిమానుల ప్రేమ , ఆశీస్సులు తమకు ఇకమీదట కూడా ఉండాలని కోరుకున్నారు. ఆమె భర్తతో కలిసి కవలలను ఎత్తుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

సినీ నటి నమిత అంటే తెలియనివారుండరు. ఆమె తెలుగులో నటించిన సినిమాలు తక్కువే అయిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సింహా , జెమిని , సొంతం సినిమాలతో పాటుగా అనేక తమిళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.